ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జే.పీ చెరువు గ్రామ సమీపంలోని పొలాల్లో కొండచిలువ కలకలం రేపింది. స్థానిక రైతులు ఈ కొండచిలువను గుర్తించి, వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు తక్షణమే అక్కడికి చేరుకొని, కొండచిలువను చాకచక్యంగా బంధించారు. అనంతరం, స్థానిక నల్లమల అటవీ ప్రాంతంలో కొండచిలువను సురక్షితంగా విడిచిపెట్టారు. కొండచిలువను అధికారులు బంధించడంతో స్థానిక రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
కొండచిలువ దాదాపు 10 అడుగులకు పైగా ఉందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.