చైనాకు చెందిన షావోమీ సబ్ బ్రాండ్ ‘రెడ్ మీ’ నోట్ 11ఎస్ఈ పేరుతో స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అందుబాటు ధరకే ఈ ఫోన్ ను తీసుకురావడం ఆకర్షణీయంగా చెప్పుకోవాలి. 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీతో ఒకటే వేరియంట్ గా వచ్చిన దీని ధర రూ.13,499. బ్లాక్, వైట్, బ్లూ రంగులలో లభిస్తుంది. ఆగస్ట్ 31 నుంచి ఫ్లిప్ కార్ట్, షావోమీ పోర్టల్, స్టోర్లలో లభిస్తుంది. రెడ్ మీ ఇప్పటికే నోట్ 11, నోట్ 11టీ 5జీ, నోట్ 11 ప్రో పేరుతో మూడు ఫోన్లను ఆఫర్ చేస్తోంది.
రెడ్ మీ 11 ఎస్ఈ స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే.. 6.43 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, హోల్ పంచ్ కటౌట్ తో కూడిన డిజైన్, ముందు భాగంలో 13 మెగా పిక్సల్ కెమెరా, వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా ఉన్నాయి. మీడియాటెక్ హీలియో జీ95 చిప్ సెట్ తో పనిచేస్తుంది. ఇందులో ప్రధాన కెమెరా మెగాపిక్సల్ 64 ఉండగా కెమెరాలో ఎక్కువ ఫీచర్లున్నాయి. ఐపీ 53 రేటింగ్ తో వస్తుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఉంటుంది. రీడింగ్ మోడ్, సన్ లైట్ మోడ్స్ సైతం ఉన్నాయి.