కరీంనగర్ జిల్లా:మండల కేంద్రంలో సాయంత్రం ఐదు గంటలకు గన్నేరువరం మండల కేంద్రంలో జరిగే కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం, బహిరంగ సభకు పోలీసుల అనుమతితో సర్వం సిద్ధమైంది. ఈ బహిరంగ సభకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ముఖ్యఅతిథి, సభలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొననున్నారు. మంగళవారం వరకు ఈ సభకు ఎలాంటి అనుమతులు పోలీసులు ఇవ్వకపోవడంతో మండలంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
యువజన సంఘాల నాయకుడు చొక్కారావు పల్లె గ్రామ ఉపసర్పంచ్ అల్లూరి శ్రీనాథ్ రెడ్డి తన అనుచరులతో భారీ సంఖ్యలో చేరికలు ఉండడంతో ఈ సభ పై అత్యంత ఉత్కంఠ నేలకొంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, యువకులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి కోరారు.