రాష్ట్రంలోని గవర్నమెంట్ స్కూళ్లకు మంజూరుచేసే వార్షిక స్కూల్ గ్రాంట్, స్పోర్ట్స్ గ్రాంట్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. 2023 – 24 విద్యాసంవత్సరానికి రూ.34.09 కోట్లు స్కూల్ గ్రాంట్, రూ.8.22 కోట్ల స్పోర్ట్స్ గ్రాంట్‌ను రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల విద్యుత్ బిల్లులు, స్కూళ్లలో చాక్ పీసులు సహా ఇతర ఏ వస్తువులు కొనుగోలు చేయాలన్నా ఈ నిధులనే ఉపయోగిస్తారు.