మంచిరియల్ జిల్లా : యువత పట్టుదలతో చదువుకుని సన్మార్గంలో అభివృద్ధి చెందాలని రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ రెమా రాజేశ్వరి అన్నారు. శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల సబ్ డివిజన్ జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లినగర్ గ్రామంలో జన్నారం పోలీస్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా నిర్వహించిన పోలీస్ మీకోసం కార్యక్రమానికి డీసీపీ సుధీర్ రామనాథ్ కేకన్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పోలీస్ మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అల్లినగర్, దొంగపల్లి, మల్యాల, బొమ్మేన, పైడిపల్లి గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటూ రక్షణ కల్పించడం జరుగుతుందని, ఈ గ్రామాలలో చదువుకొనే యువతీ యువకులు ఉన్నారని, పట్టుదలతో చదువుకుని ఉద్యోగ సాధనకై కృషి చేసే వారికి పోలీస్ శాఖ తరపున సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న పోలీసులను కుటుంబ సభ్యులుగా చూసుకొని అవసరం ఉన్నటువంటి సహాయం పొందవచ్చని, మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం తరుపున అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే పోలీస్ అధికారుల దృష్టి కి తీసుకువస్తే సంబందించిన ప్రభుత్వ శాఖల వారితో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం గ్రామంలోని 300 మంది మహిళలకు చీరలు, యువకులకు వాలీబాల్ కిట్స్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏ.సి.పి. తిరుపతిరెడ్డి, లక్షేట్టిపేట సీ.ఐ. కృష్ణ రెడ్డి, జన్నారం ఎస్. ఐ. సతీష్ , సర్పంచ్, ఎం.పి.పి., ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.