పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం జానపడు గ్రామంలో నిన్న రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలు ఘనంగా జరిగాయి. గ్రామస్తులు ఎల్లమ్మ తల్లి చిత్ర పటంతో ఊరేగింపుతో, కనక తప్పెట్లు, వీర తాళ్ళు, మేళతాళాలు, భజన, కోలాటములతో గ్రామస్తులు అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం మహా అన్నదానం జరిగింది. ఈ కార్యక్రం ఆళ్ళ పూర్ణచందర్ రావు , రేణుక ఎల్లమ్మ తల్లి భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.