పల్నాడు జిల్లా కారంపూడి : కారంపూడి బస్టాండ్ సెంటర్లో ఆర్ అండ్ బి రోడ్డు భారీ గుంతలు పడి వాహనదారులకు ఇటు జనానికి ఇబ్బందికరంగా ఉందని సిపిఐ సిపిఐ నాయకులు సమావేశం ఏర్పాటు చేసారు.
సీపీఐ మండల కార్యదర్శి షేక్ సైదా మాట్లాడుతూ కారంపూడిలో రోడ్లు ఎటు చూసినా గుంతల మయమై ఉన్నాయని, బస్టాండ్ సెంటర్, వినుకొండ రోడ్డు బ్రిడ్జి, మాచర్ల రోడ్డులో స్టేట్ బ్యాంకు దగ్గర రోడ్ల అధ్వానంగా ఉన్నాయన్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత పది రోజులుగా కారంపూడిలో గడపగడపకు కార్యక్రమం చేస్తున్నా గాని గుంతల పూడ్చిన పాపాన పోలేదని, ఈ గుంతల వలన ట్రాఫిక్ ఆగిపోవడమే గాక ప్రమాదాల జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఇకనైనా అధికారులు తక్షణమే స్పందించి గుంతలను పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని షేక్ సైదా డిమాండు చేసారు.
ఈ కార్యక్రమంలో కారంపూడి పట్టణ కార్యదర్శి సూర్య, హనుమంతరావు, సిపిఐ మండల సహాయ కార్యదర్శి కూరాకుల వెంకట శివయ్య, ఒప్పిచర్ల కార్యదర్శి ఇందూరు శ్రీనివాసరావు, కొదమగుండ్ల కార్యదర్శి మేకపో చిన్నకోటిరెడ్డి, గాలం శీను, సిహెచ్ నాగేశ్వరావు మొదలగు వారు పాల్గొన్నారు.