- గత కొద్ది రోజులుగా షోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఫోటో
- తప్పిపోయిన మాటలు రాని అమ్మాయి అడ్రస్ చెదించిన రిపోర్టర్ టీవీ జిల్లా ఇంచార్జ్ శ్యామ్
- రేపు సాయంత్రం సొంత ఇంటికి చేరుకొనున్న సునీత
అన్నమయ్య జిల్లా , రాయచోటి : ఈ ఫోటోలో ఉన్న ఆమె కు మాటలు రావు రెండు నెలల నుండి వనపర్తి సఖి సెంటర్లో ఉంటుంది. ఆమె పేరు మాత్రం K సునీత అని రాయగలుగుతుంది. ఆమెకు తల్లి తండ్రి ఉన్నారని ఒక బాబు ఉన్నారని, ఈమెకు వికలాంగుల పెన్షన్ కూడా వస్తుందని సైగ ద్వారా తెలియజేస్తుంది. విపరీతమైన బాధతో ఏడుస్తుంది. కానీ అడ్రస్ చెప్పలేకపోతోంది. దయచేసి ఈమె అడ్రస్ తెలిస్తే తెలపాలంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తను అన్నమయ్య జిల్లా రిపోర్టర్ టీవీ ఇంచార్జ్ అయిన లంకిపల్లి శ్యాంమ్మూర్తి నాయుడు ప్రత్యేక దృష్టి సాధించి ఆమెది అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలానికి చెందినదిగా గుర్తించి, రేపు సాయంత్రానికల్లా వనపర్తి నుంచి తన స్వగ్రామానికి చేరుకునే విధంగా ప్రయత్నాలు చేశారు.