మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పిన్నారం, ఏడగట్ట గ్రామ పంచాయతీలలో గత రెండేళ్లుగా రేషన్ డీలర్ అంత్యోదయ రేషన్ కార్డుల ద్వారా ఇవ్వాల్సిన 35 కిలోల రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. రెండు గ్రామాల్లో దాదాపు 43 అంత్యోదయ రేషన్ కార్డులు ఉండగా అందులో కొందరికి మాత్రమే ఇస్తూ, మరికొందరికి ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ డీలర్ తమ పొట్ట కొడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసారు . ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే డీలర్ పై చర్యలు బాధితులు కోరుతున్నారు.