తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’కు సంగీతం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కీరవాణిని కోరడం… మన తెలంగాణ గీతానికి పొరుగు రాష్ట్రం వారు సంగీతం అందించడమేంటని తెలంగాణ సినీ మ్యూజీషియన్స్ సంఘం (టీసీఎంఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. ఆ మేరకు టీసీఎంఏ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసింది.
అయితే, ఈ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాయదుర్గంలోని కీరవాణి స్టూడియోకి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర గేయం రికార్డింగ్ పూర్తయిన నేపథ్యంలో… మరోసారి మార్పులు, చేర్పులపై కీరవాణితో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు చేశారు.
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో, ఈ గీతాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతుల మీదుగా విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే వీలైనంత త్వరగా పాటకు ఫైనల్ మిక్సింగ్ చేయాలని కీరవాణి భావిస్తున్నారు.
రాయదుర్గంలో ఉన్న ఎంఎం కీరవాణి స్టూడియోకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర గేయం రికార్డింగ్ పూర్తయిన నేపథ్యంలో మరోసారి మార్పులు, చేర్పులపై సమాలోచనలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. pic.twitter.com/fp0xX86zfE
— HEMA NIDADHANA (@Hema_Journo) May 26, 2024