తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు విజయవాడ వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సభ నిర్వహించనున్నారు. ఈ సభకు హాజరుకావాలంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇటీవల రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులతో కలసి రేవంత్‌రెడ్డి రేపు విజయవాడ వెళ్లనున్నారు.