తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, ప్రియాంకగాంధీతో భేటీ అయ్యారు. ఈ రోజు ముంబై నుండి నేరుగా ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి టెన్ జన్‌పథ్‌కు వెళ్లారు. అక్కడే ఉన్న రాహుల్ గాంధీతోనూ ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఇచ్చిన హామీలు… అమలు చేసిన హామీలపై వారితో చర్చించినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కూడావారితో చర్చించారని తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కూడా వారి మధ్య చర్చ జరిగింది. రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సమావేశమై అభ్యర్థులను ఖరారు చేయనుంది. ప్రియాంక గాంధీని కలిసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొని… ఫొటోను షేర్ చేశారు.