హైదరాబాద్ : ఈ రోజు గాంధీభవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో టిపిసిసి అధ్యక్షులు ఎ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడి ఇతర పార్టీలో జాయిన్ అయినా పలు ప్రముఖులను మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది,తెలంగాణ రాష్ట్రంలో బారాసా ను ఓడించే సత్తా కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ఉందని,కాంగ్రెస్ పార్టీ అమ్మ లాంటిది అని అందరం కలిసి పోరాడితే విజయం తథ్యం అని తెలిపారు. వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ ను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించడం జరిగింది. రేవంత్ రెడ్డి ఆహ్వానించడం పట్ల వారి సానుకూలత ఉందని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పెనుమార్పు సృష్టిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.