రాజమహేంద్రవరం : వివరాల్లోకెళ్తే తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ సమగ్ర వైద్యశాల లో జిల్లాలోని వివిధ మండలాలు గ్రామాల నుండి అధిక సంఖ్యలో నిండు గర్భిణీలు చూపించుకోవడానికి వస్తారు. వివిధ మండలాల్లోని గ్రామాల్లోని హై రిస్క్ గర్భిణీల జిల్లా ప్రధాన ఆసుపత్రికి రిఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం సుమారు 8 ,9 నెలలు నిండిన గర్భిణీలు డాక్టర్లు కు చూపించుకోవాలి అంటే చుక్కలు చూపిస్తున్న వైనం, వందల సంఖ్యలో గర్భిణీలు ప్రతినిత్యం ప్రతిరోజు ఈ ఆసుపత్రికి చూపించుకోవడానికి వస్తూ ఉంటారు, వారికి కనీసం కూర్చోవడానికి కూడా కనీస అవసరాలు కూడా కల్పించని ఈ ఉన్నత అధికారుల, గంటల తరబడి లైన్లో నుంచోవడం అలాగే టెస్టుల దగ్గర, అనేక ఇబ్బందులు పడుతున్నామని గర్భిణీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆశతో జిల్లాలోని నిరుపేదలు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరుగుతుందని కానీ ఇక్కడ ఏ విధమైన సౌకర్యాలు కల్పించడం లేదని ఇక్కడికి వస్తున్న గర్భిణీలు అలాగే వారి బంధువులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకు మాత్రమే పెద్ద ఆసుపత్రి అని ఇక్కడ సౌకర్యాలు శూన్యమని గర్భిణీలు వారి కుటుంబ సభ్యులు అంటున్నారు, కావున ఉన్నత అధికారులు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి గర్భిణీలు అవస్థలు పడకుండా తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.