contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సర్పంచ్ చేతుల్లోకి సచివాలయాలు : ఆర్.జె. వెంకటేష్

అన్నమయ్య జిల్లా, మదనపల్లి :గ్రామ పంచాయతీలకు మళ్ళీ మంచిరోజులు రానున్నాయని,సర్పంచ్‌లకు మళ్లీ అధికారాలు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ గ్రామ పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని,సచివాలయ వ్యవస్థను తీసుకురావడంతో గ్రామ పంచాయతీలు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాయన్నారు. పంచాయతీలకు మంజూరైన 14, 15 ఆర్థికసంఘం నిధులను వైసీపీ సర్కారు ఇతర అవసరాలకు దారిమళ్లించేదని తద్వారా పాలక వర్గాలు ఉత్సవ విగ్రహాల్లా మారాయని అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలని యోచిస్తోందన్నారు .సచివాలయాలను గ్రామ పంచాయతీలతో అనుసంధానం చేసేలా అడుగులు వేస్తోందని,సర్పంచ్‌లకే పూర్తి అధికారాలు అప్పగించాలని భావిస్తోందన్నారు .అయితే ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా గ్రామ పంచాయతీలకు వెళ్లకుండా సచివాలయాలకు పరుగులు తీస్తున్నారని,సచివాలయాల నిర్వహణ బాధ్యత గ్రామ పంచాయతీలకు ఉన్నా అందులో పనిచేసే ఉద్యోగులు వారి పరిధిలో లేకుండా పోయారన్నారు. వాటి పర్యవేక్షణను రెవెన్యూ శాఖకు అప్పగించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కనీసం పంచాయతీ సాధారణ నిధులు ఖర్చు చేయడానికి కూడా అభ్యంతరాలు తెలిపిందని మండిపడ్డారు. తమకు హక్కులు కల్పించాలని సర్పంచ్‌లు పలుమార్లు వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పాలకులు పట్టించుకోలేదని, దీంతో అటు సర్పంచులు కాని ఇటు పంచాయతీ కార్యదర్శులు గాని ఏమీ చేయలేకపోయారన్నారు.నిధుల ఖర్చు విషయంలో జగన్‌ సర్కారు కట్టడి చేయడంతో పంచాయతీల్లో కనీస వసతులు సమకూర్చడానికి ఆపసోపాలు పడ్డారని, కొన్ని పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులకు వేతనాలను సకాలంలో చెల్లించలేకయారన్నారు. చిన్నచిన్న మరమ్మతు పనులకు బిల్లులు ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడారని,ఆదాయం ఉన్న పంచాయతీలదీ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ వ్యవస్థకు గత వైభవం తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు చేపడుతున్నారని,జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పంచాయతీ రాజ్‌శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. సచివాలయ ఉద్యోగులను పంచాయతీలకు అనుసంధానం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని, సర్పంచ్‌లకు అధికారం అప్పగించడం ద్వారా గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజలకు సత్వర సేవలు అందుబాటు లోకి తెచ్చేలా అడుగులు వేస్తోందన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :