contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఘోర ప్రమాదం 15 మంది విద్యార్థుల మృతి

మణిపూర్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నోనీ జిల్లా లాంగ్ సాయ్ వద్ద ఓ విద్యాసంస్థకు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది బాలికలు దుర్మరణం చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. విద్యార్థులు విజ్ఞాన యాత్రకు వెళ్లిన సందర్భంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ఈ విద్యార్థులంతా యారిపోక్ లోని తంబాల్ను హయ్యర్ సెకండరీ స్కూలుకు చెందినవారు. ఎడ్యుకేషనల్ టూర్ నిమిత్తం రెండు బస్సుల్లో ఖౌపుమ్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :