కరీంనగర్ జిల్లా: కరీంనగర్ నగరంలోని మంచిర్యాల చౌరస్తాలో టూ వీలర్ పై వెళ్తున్న కేశవపట్నం గ్రామానికి చెందిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ గుర్రం రామచంద్రం ను ఎరువుల లోడుతో వెళ్తున్న లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేశవపట్నం గ్రామానికి చెందిన గుర్రం రామచంద్రం పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ కొద్దికాలం క్రితం రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన కేశవపట్నంలో నివాసం ఉంటున్నారు.రామచంద్రం పోలీస్ శాఖ పై ఉన్న మక్కువతో తన ఇద్దరు కుమారులను పోలీస్ కావాలని ప్రోత్సహించడంతో పోలీస్ శాఖలో సేవలందిస్తున్నారు. ప్రస్తుతం చిన్న కుమారుడు టూ టౌన్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు.