విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం పెద్దమానాపురం జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు , ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. ఈ రహదారిపై గత కొన్ని సంవత్సరాల నుంచి రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ, ఇంకా పూర్తి అయినట్లు కనబడడం లేదు.
ఈ రహదారిలో నిర్మించిన సర్వీస్ రోడ్ గుంతలతో ఉండటంతో వాహనాలు ఒక వైపుకు ఒరిగి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. వాహనాలు సురక్షితంగా వెళ్లలేక, జనాలు ఇబ్బందులు పడుతున్నాయి.
ప్రజలు ఈ రోడ్డు పనులను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. “ప్రస్తుతం ఈ రహదారి మీద ప్రయాణం చాలా ప్రమాదకరం. గోతులు, గుంతలు వలన పెద్ద ప్రమాదాలు జరగవచ్చని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు