contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అనంతగిరిలో అర కొర రోడ్డు పనులు

  • పనులు చేయకుండానే లక్షల్లో బిల్లులు మార్చేశారు!!
  • మిషన్ కనెక్టివిటీ చెదలు పట్టించిన ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీర్ విభాగం!!
  •  అనంతగిరి జడ్పీటీసీ గంగరాజు పర్యటనలో విస్తు పోయే నిజాలు!!
  • కాంట్రాక్టలకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు కాసులు కురిపిస్తున్న మిషన్ కనెక్టివిటీ!!

 

అల్లూరి జిల్లా, అనంతగిరి,ది రిపోర్టర్ : అనంతగిరి మండలంలో పాతకోట, రేగం, నందిగుమ్మి, తేనేపుట్ట, తలారిపాడు గ్రామాల్లో అరకొరగా జరుగుతూ కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం పై సంబంధిత ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీర్,  అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల్లో పర్యటించి పరిశీలించిన అనంతగిరి జడ్పిటిసి దీసరి గంగరాజు.

ఈ సందర్భంగా జడ్పీటీసీ దీసరి గంగరాజు పర్యటనలో ఎదురు చూసిన సమస్యలు  మిషన్ కనెక్ట్ పాడేరు పివిటీజి గ్రామాలకు రోడ్డు నిర్మాణం కోసం ఉపాధి హామీ పథకం ద్వారా రూ.  2 కోట్లా 16 లక్షల 47686.85 రూపాయలు నిధులు ఖర్చు కాలి బాట ఏర్పాటు చేసిన ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ అధికారులు.

ఇది మారుమూల కొండ శిఖర మన పివిటీజి గ్రామాల దుస్థితి,  మిషన్ కనెక్టివిటీ క్రింద రూ.77 లక్షల రూపాయలు మార్చేశారు. మొత్తం ఎమౌంట్ రూ.2 కోట్లా 93 లక్షలు రోడ్డు నిర్మాణం చేసినట్లుగా రికార్డు చూపిస్తున్నారు. హెర్త్ వర్క్ చేశారు.  గ్రావెల్ రోడ్డుగా బిల్లు మార్చేశారు. తేనెపుట్టు, తలారిపాడు గ్రామాల్లో డోలీ మోతలు తప్పడం లేదు.

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం అనంతగిరి పంచాయతీ కొండ శిఖర గ్రామాలైన తేనెపుట్టు తలారిపాడు నందిగుమ్మి, నుండి పాతకోట వరకు 50 కుటుంబాలు 200 మంది జనాభా పివిటీజి కోందు ఆదివాసీ గిరిజనుల జీవనం సాగిస్తున్నారు. వీరు అనంతగిరి మండల కేంద్రములో రావటానికి సుమారుగా 8 కిల్లోమీటర్ల దూరం కాళీ నడకన రావాలి.    అనంతగిరి నుండి పాతకోట రూ.1.20 ఒక్క కోటి ఇరవై లక్షల, రేగం నుండి తేనెపుట్టు రూ.65 లక్షలు తేనెపుట్టు నుండి తలారిపాడు రూ.1.25 ఒక కోటి ఇరవై ఐదు లక్షలు, నందిగుమ్మి నుండి రేగం 1.10 ఒక కోటి పది లక్షలు నందిగుమ్మి నుండి మద్దిగరు 40 లక్షలుఆయా గ్రామాల పరిధిలో వెళ్ళే రోడ్లు నిర్మాణాలకు మొత్తం రూ.4.60 నాలుగు కోట్లా అరవై లక్షల మంజూరు అయ్యాయి.

నిధులు ఖర్చు అవుతున్నట్టు రికార్డుల్లో నమోదు అవుతుంది. కాని రోడ్డు నిర్మాణాలు కోట్లు ఖర్చు పెట్టిన అస్తవ్యస్తంగా ఉన్నాయి. పివిటిజి గ్రామాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించినా రోడ్డు సౌకర్యాలు పివిటీజి గిరిజనులకు అందని ద్రాక్ష గా ఉన్నాయి. దిని అంతటికీ కారణం గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఇంజినీర్,  అధికారుల నిర్లక్ష్యం.  రోడ్డు పనులు జరుగుతున్నప్పుడు ఇంజినీర్,  అధికారుల జాడ కనపడదు. కానీ బిల్లులు మాత్రం యధావిధిగా అప్ లోడ్ అవుతోంటాయి. కాలం గడుస్తుంది ప్రభుత్వాలు మారుతుంటాయి. గిరిజనులకు డోలీ మోతలే శరాణ్యం అవుతున్నాయి.

అధికారుల నిర్లక్ష్యం అనుకోవాలా? సమిష్టి భాగస్వామ్యం అనుకోవాలా ?  ప్రజా ప్రతినిధులుగా మేము పర్యవేక్షణ చేస్తే అంత అస్తవ్యస్తంగా, అయ్యోమయ్యంగా ఉందంటున్నారు సిపిఎం పార్టీ నాయకులు.  గత ప్రభుత్వం హయాంలో జరిగిన కల్వర్టు పనులకు తెచ్చిన కల్వర్టు 30 గొట్టాలు పైబడి వాలసి వెళ్ళే రోడ్డుకు ఆనుకొని పడేసి ఉన్నాయి.   బిల్లులు మారితే చాలు కాంట్రాక్టర్లు పట్టించు  పట్టించుకోరు. జడ్పిటిసి గా నా పర్యటనలో వచ్చిన సమస్యలపై 7 తేదీన జరిగే జిల్లా పరిషత్ స్ధాయి సంఘాల మీటింగ్ లో చర్చించి జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి జల్లిపల్లీ సుభధ్ర  జిల్లా కలెక్టర్ కి ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వి.అభీషేక్ లకు పిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ పర్యటన కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సోమెల నాగులు, అనంతగిరి వైస్ సర్పంచ్ పాంగి అర్జున్ గిరిజన సంఘం నాయకుడు నరాజీ సురేష్ బాబు, సోమెల రాంబాబు, ధర్మన్న డి.దేముడు, పి.పండన్న, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :