contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రోడ్డు పనులను మొదలెట్టండి మహాప్రభో

  • స్వయంగా గ్రామాన్ని సందర్శించిని పూర్వపు పిఓ ఆర్.గోపాలకృష్ణ.
  • అప్పటి ఐటీడీఏ,పిఓ హామీ గాలి కోదిలిసిన అధికారులు.
  • తుతూ మంత్రాంగా రోడ్డు పని.
  • అక్కడక్కడ నాసిరకంగా సీసీ రోడ్ల నిర్మాణం.
  • పని మధ్యలో చేతులెత్తిసిన కాంట్రాక్టర్.
  • గుర్రాల్ని నిలబెట్టి పీవీటిజీ ఆదివాసీ గిరిజనుల వినూత్న నిరసన.
  • జిల్లా కలెక్టర్ కు చేతులు జోడించి నమస్కరిస్తున్న దాయర్తి(గుర్రాల)గ్రామ ప్రజలు.

 

అల్లూరి జిల్లా, అనంతగిరి, ది రిపోర్టర్  : అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మారుమూల పినకోట,పెద కోట,జీనబాడు పంచాయతీ పరిధిలో కొండ శిఖర గ్రామాలైన బల్లగరువు నుండి దాయర్తి గ్రామం వరకు 8 కిలోమీటర్ల బి.టీ రోడ్డు నిర్మాణానికి మిషన్ కనెక్ట్ పాడేరు ఉపాధి హామీ నిధులను ఉమ్మడి జిల్లా కలెక్టర్ డాక్టర్.మల్లికార్జున్ రావు (ఆర్.సి . No.1/2022/ నిధులు విడుదల చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు కాంట్రాక్టర్లు రోడ్డు పనులు ప్రారంభిస్తూ శంకు స్థాపన చేశారు.  కానీ నేటికీ రెండుసంవత్సరాలు అవుతున్న రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టి అక్కడక్కడ సీసీ రోడ్లు వేసి నిలిపివేశారు.

ఈ రోడ్డు కు అనుసంధానంగా 9 గ్రామాలు వున్నవి అందులో పీచు మామిడి, గుమ్మంతి, కరకవలస, గుర్రాలు బైలు, రాచికిలం,రెడ్డిపాడు,మడ్రేబు, తునిసిబు,కోటల గరువు, గ్రామాలకు చెందిన పివిటీజి కొందు ఆదివాసి గిరిజనులు రెండువేల మంది జనాభా కొండ శిఖరం పై ఎన్నో ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. నిత్యావసర సరుకులు కోసం, బియ్యం కోసం జిసిసి డిపో వెళ్లాలన్న,అనారోగ్యం సంభావిస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వచ్చిన 20 కిలోమీటర్ల దూరం డోలి మోయాలి లేదా గుర్రాలపై ప్రయాణం చేయవలసిన దుస్థితి.
పండించిన పంటలు అమ్ము కోవాలంటే గుర్రాల మీద ప్రయాణం చేసి సంతలకు తీసుకెళ్లే పరిస్థితిమాది.

2021 సంవత్సరంలో పూర్వపు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ మా దయార్తి గ్రామాన్ని సందర్శించి రూ.60 లక్షలు సిసిడిపి నిధులు కేటాయించారు,
అలాగే స్కూల్ బిల్డింగ్ కి నాడు-నేడు నిధుల నుండి రూ.14 లక్షలు నిధులు మంజూరు చేశారని,అలాగే రక్షత మంచినీటి పథకం కోసం రూ.8 లక్షలు నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఆరు గ్రామాల్లో స్కూల్స్,
ఆరు అంగన్వాడి కేంద్రాలున్నాయని,రోడ్డు సౌకర్యం లేకపోవడంతో రోజువారి గుర్రాల మీద ప్రయాణించ వలసింది పరిస్థితి ఏర్పడుతుందని, రెండు సంవత్సరాలు గడుస్తున్న నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించలేదని వారు వాపోయారు,  ఇక ఆలస్యం చేయకుండా తక్షణమే రోడ్డు పనుల ప్రారంభించాలని గుర్రాలను దగ్గర పెట్టుకొని పరిసర ఆదివాసీ గిరిజనులంతా చేతులు జోడించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీదరి సుధాకర్, ఆనంద్, కొండతాంబరి సోమన్న, పలు గ్రామాల గిరిజనులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :