తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శనివారం సాయంత్రి ఓ వినూత్న ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పోస్టు కార్డుల ఉద్యమాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందక్భంగా ఓ పోస్టు కార్డు తీసుకున్న కేటీఆర్… ప్రధాని మోదీకి చెప్పాలనుకున్న విషయాన్ని తన స్వదస్తూరితో రాశారు.
రాష్ట్రంలోని చేనేత కార్మికులతో పాటు చేనేత ఉత్పత్తులపై ప్రేమ ఉన్న వారంతా ప్రధానికి పోస్టు కార్డు రాయాలంటూ ఆయన తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తాను రాసిన పోస్టు కార్డులో చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయడంతో పాటుగా చేనేత రంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలను కేటీఆర్ ప్రస్తావించారు. కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ నుంచి ప్రధానికి పెద్ద సంఖ్యలో పోస్టు కార్డులు వెళ్లే అవకాశాలున్నట్లు విశ్లేషణలు సాగుతున్నాయి.
చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలని పిలుపునిచ్చిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRTRS ఈరోజు ప్రధాని నరేంద్రమోడీకి ఒక పోస్ట్ కార్డుని రాశారు.#RollbackHandloomGST pic.twitter.com/EjfEgB5MpG
— TRS Party (@trspartyonline) October 22, 2022