పల్నాడు జిల్లా,రొంపిచర్ల మండలం:స్దానిక పోలీస్ స్టేషన్ ను మంగళవారం నరసరావుపేట డిఎస్పీ కె.విజయభాస్కర్ తనిఖీ చేశారు. స్టేషన్ లో రికార్డులను, సిబ్బంది పనితీరును పరిశీలించి తగు సూచనలు చేశారు. విధినిర్వహణలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు. ఈ సందర్భంగా డిఎస్పీ విజయభాస్కర్ మాట్లాడుతూ వార్షిక తనిఖీలో భాగంగా ఈ స్టేషన్ ను తనిఖీ చేశామని అన్నారు. పెండింగ్ లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సిబ్బంది పనితీరును ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. తొలుత పోలీసుల నుండి గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట రూరల్ సిఐ భక్తవత్సల్ రెడ్డి, ఎస్.ఐ సురేష్ బాబు, పోలీసులు పాల్గొన్నారు.