రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 347 టీచర్ పోస్టులను భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది. అర్హతగల అభ్యర్థులు 2024 ఫిబ్రవరి 6నుంచి మార్చి 6 అప్లై చేసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాలకు హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (RPSC) సీనియర్ టీచర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 347 పోస్టులను భర్తీ చేయనుండగా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించింది.
ఖాళీల వివరాలు
సంస్కృతం: 79 పోస్టులు
హిందీ: 39 పోస్ట్‌లు
ఇంగ్లీష్: 49 పోస్ట్‌లు
జనరల్ సైన్స్: 65 పోస్టులు
గణితం: 68 పోస్టులు
సైన్స్: 47 పోస్టులు
అర్హతలు:
సంబంధిత సబ్జెక్టులో స్సెషల్ కోర్సులో ఉత్తర్ణులైన వారు అర్హులు. వయోపరిమితి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు:
2024 ఫిబ్రవరి 6నుంచి మార్చి 6 అప్లై చేసుకోవాలి. rpsc.rajasthan.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము:
జనరల్ కేటగిరీ దరఖాస్తు రుసుము ₹600/ EWS/ OBC/ BC/ SC/ ST కేటగిరీ అభ్యర్థులు ₹400లగా కేటాయించింది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు చేయాలి.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్: https://rpsc.rajasthan.gov.in