అన్నమయ్య జిల్లా, మదనపల్లి : జిల్లాకు ఆనుకొని ఉన్న కర్ణాటక రాజధాని బెంగళూరు కు నిత్యం వేల సంఖ్యలో ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇక వివిధ కంపెనీలల్లో ఉద్యోగం చేస్తున్న జిల్లావాసులు లక్షల్లోనే ఉన్నారు. అయితే ప్రతిరోజూ స్వస్థలాలకు రాకపోకలు సాగించేవారు చాలామందే ఉన్నారు. ఇక శని, ఆదివారం వస్తే మరింత ఎక్కువ మంది తమ స్వస్థలాలకు చేరుకుంటారు. ముఖ్యంగా మదనపల్లి, పీలేరు, తిరుపతి, రాయచోటి, కడప వాసులు మదనపల్లి మీదుగానే రాకపోకలు కొనసాగిస్తున్నారు. అయితే అందుకు తగ్గట్టుగా APSRTC బస్సులు నడపడం లేదంటూ ప్రయానికులు మండిపడుతున్నారు. తద్వారా ప్రయానికులు ప్రయివేటు ట్రావెల్స్ పైన ఆధారపడుతున్నామని అంటున్నారు.ప్రస్తుతం అంతర్రాష్ట సర్వీసుల్లో RTC కన్నా ప్రయివేటు బస్సు సర్వీసులు అధికంగా ఉన్నాయని అంటున్నారు. APSRTC మరియు KSRTC మేనేజింగ్ డైరెక్టర్ ఇటీవల విజయవాడలో చేసిన ఒప్పందం ప్రకారం రెగ్యులర్ సర్వీస్‌ను పెంచడానికి ఆంధ్ర మరియు కర్ణాటక ప్రభుత్వాల నుండి గెజిట్ నోటిఫికేషన్‌ను తీసుకు వచ్చిందని దానిని ఆమోదించాలని ప్రయానికులు కోరుతున్నారు. APSRTC మరియు కర్ణాటక RTC బస్సులు మదనపల్లి నుండి చింతామణి, బెంగుళూరు మరియు కడప నుండి బెంగుళూరు నుండి రాయచోటి మదనపల్లె చింతామణి బెంగుళూరు మరియు తిరుపతి నుండి బెంగుళూరు, పీలేరు, మదనపలల్లి, చింతామణి, యలహంక బెంగుళూరు వరకు చాలా తక్కువని తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ బస్సులలో ప్రయాణం చేస్తూ చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాము అని తెలుపుతున్నారు. ఉదయం 5 గంటలనుండి అర్ధరాత్రి 12 వరకు దయచేసి అంతర్రాష్ట్ర సర్వీసులను పెంచాలని కోరుతున్నాను. అలా చేయడం ద్వారా ప్రయానికులకు మెరుగైన సేవ మరియు RTC కి లాభం చేకూరడమే కాకుండా ప్రయివేటుకి కళ్లెం వేసినట్టు అవుతుందని తెలుపుతున్నారు.