ఆర్టీఐ బ్రతకాలంటే ఆర్టీఐ ని ప్రచారం చేయాలి, వినియోగించాలి: డిగ్రీ విద్యార్థులకు కల్పించిన ఆర్టీఐ ఆక్ట్ అవగాహన కార్యక్రమంలో సిసిఆర్ ఫౌండర్ ప్రెసిడెంట్
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని వివేకానంద డిగ్రీ కళాశాలలో కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (సిసిఆర్) సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్.టి.ఐ. 2005 చట్టం అమలు గురించి అవగాహన కార్యక్రమాన్ని సిసిఆర్ సంస్థ అధ్యక్షులు మంచికట్ల అనిల్ కుమార్ అధ్యక్షతన శనివారం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ ఆక్ట్) పై అవగాహన మరియు అవినీతి నిర్మూలన, సామాజిక అభివృద్ధి, అలాగే చట్టాలపై అవగాహన కోసం స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించే సరళిని విద్యార్థిని విద్యార్థులకు, కాలేజీ యజమాన్యం మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
తర్వాత ఆర్టీఐ చట్టంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సమాచార హక్కు చట్టంపై పరీక్ష నిర్వహించి, సిసిఆర్ సంస్థ తరపున వారికి ప్రోత్సాహక పత్రాలు అందించడం జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థులకు సిసిఆర్ సంస్థ అధ్యక్షులు పలు సూచనలు చేసారు. సమాజంలో జరుగుతున్న అవినీతి నిర్మూలనకు, సమాజ అభివృద్ధికి, తమ గ్రామ – పట్టణ అభివృద్ధి కోసం సమాచార హక్కు చట్టాన్ని ఎలా ఉపయోగించాలో తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, కాలేజీ యజమాన్యం, వివిధ జిల్లాలు – గ్రామాల నుండి వచ్చిన ప్రజలు, సిసిఆర్ సంస్థ అధ్యక్షులు మంచికట్ల అనిల్ కుమార్, స్టేట్ కమిటీ జాయింట్ సెక్రటరీ భూక్య చరణ్ కాంత్, పెద్దపల్లి జిల్లా సిసిఆర్ కమిటీ సభ్యులు గంధం ప్రశాంత్, నిమ్మ తిరుపతి, ఉమల్ల రాజేందర్, తాండ్ర సుమన్, మంచిర్యాల జిల్లా సిసిఆర్ కమిటీ సభ్యులు రాగుల రవి, జంగిలి సాగర్, కొండ నరేష్, జగిత్యాల జిల్లా సభ్యులు, అంకం భూమయ్య, ముస్కు అభిషేకర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా సభ్యులు తోట కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.