తెలంగాణ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నల్లపు మణిదీప్ అనే ఓ యువకుడు తాను తెలుసుకోవాలనుకున్న విషయాల గురించి (RTI) సమాచార హక్కు చట్టం ద్వారా పిటిషన్ వేస్తే అది ఇప్పుడు భారతదేశ అత్యున్నత న్యాయస్థానంతో పాటు అన్నీ రాష్ట్రాల హైకోర్టులను కదిలించింది. మణిదీప్ కోరిన సమాచారం ఏమిటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి అంటే సుమారు 73ఏళ్ల కాలంలో నమోదైన కేసులెన్నీ..? అందులో తీర్పు వచ్చినవి ఎన్ని ? రానివి ఎన్ని..? ఇంకా పెండింగ్‌లో ఉన్న కేసులెన్నీ..?..ఎన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయి..? వీటిపై సమాచారం కావాలని కోరాడు. మణిదీప్ చేసుకున్న ఒకే ఒక్క ఆర్టీఐ దరఖాస్తు సుప్రీం కోర్టే కాదు దేశంలోని అన్నీ హైకోర్టులతో పాటు జిల్లా కోర్టులు, సీబీసీఐడీ న్యాయస్థానాలు, ట్రైబ్యునల్స్ ఇలా అన్ని కోర్టుల్నీ అతను అడిగిన సమాచారం కదిలేలా చేసింది.
73ఏళ్ల సమాచారం కోసం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నల్లపు మణదీప్ అనే 23సంవత్సరాల యువకుడు తొలిసారిగా అలాంటి ప్రయత్నం చేశాడు. మణిదీప్ ఆర్టీఐ ద్వారా వేసిన ఒక్క దరఖాస్తు ..సుప్రీం కోర్టు మొదల్కొని..అన్నీ న్యాయస్థానాలను కదిలించింది. పినపాక మండలం ఏడళ్ల బయ్యారం క్రాస్‌రోడ్డుకు చెందిన స్టూడెంట్ నల్లపు మణిదీప్ .. తనకు సమాచార హక్కు చట్టం ద్వారా తనకు భారత దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలకు సంబంధించి తీర్పు వెల్లడించినవి, ఇంకా తీర్పు రానివి, పెండింగ్‌లో ఉన్న కేసులు, ఎన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి..అందుకు గల కారణాలపై సమాచారం ఇవ్వాలని సెక్షన్ 4(1(C)(D)ప్రకారం కోరాడు.
ఒక ఆర్టీఐ ధరఖాస్తూ విలువెంతో సుప్రీంకోర్టు తెలియజేసింది. మనం స్థానికంగా ఆర్టీఐ ధరఖాస్తూ ఇస్తే కొన్ని సమయాలలో పట్టించుకునే నాధుడే ఉండదు. చివరికి ఆర్టీఐ కమిషనర్లు కందరు భూములు కబ్జా చేసే పరిస్థితికి దిగజారారు. కానీ గత నెలలో మణిదీప్ వేసిన ఆ ఒక్క పిటిషన్‌పై డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్ స్పందించింది. మణిదీప్ కోరిన వివరాలు, సమాచారం అందజేసేందుకు సముఖుత వ్యక్తం చేస్తూ అతని దరఖాస్తును సుప్రీం కోర్టుతో పాటు అన్నీ హైకోర్టులకు ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది. ఈ ఆర్టీఐ దరఖాస్తుపై పూర్తి సమాచారం ఇచ్చేందుకు అవసరమైతే ఇతర శాఖలకు పంపించి ఇవ్వవలసినదిగా కోరింది.