సచిన్ టెండూల్కర్ మెచ్చే ఆటతీరును ప్రదర్శిస్తోంది ఓ బాలిక. ఈ విషయాన్ని స్వయంగా సచిన్ షేర్ చేయడం గమనార్హం. వచ్చిన ప్రతి బాల్ ను యువ క్రీడాకారిణి చీల్చి చెండాడుతుంటే, సంబంధిత వీడియోని సచిన్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. ‘‘క్యా బాత్ హై. నీ బ్యాటింగ్ చూసి నిజంగా ఎంతో ఆనందించాను’’ అంటూ సచిన్ తన స్పందన తెలియజేశారు. నిన్ననే ఐపీఎల్ వుమెన్ వేలం జరగగా, నేడు మ్యాచ్ మొదలైందా ఏంటి? అంటూ ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు. సచిన్ పోస్ట్ పై యూజర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఈ నెల 14న సచిన్ ఈ పోస్ట్ పెట్టగా, 24 గంటలు కూడా గడవక ముందే 16 లక్షల మంది దీన్ని చూశారు. సచిన్ ట్విట్టర్ పేజీలో చిచ్చుబుడ్డి లాంటి ఓ క్రికెటర్ వీడియోని కూడా చూడొచ్చు. అందులో బాలుడి ప్రతిభ ఆశ్చర్యపరిచేలా ఉంది.