ర్శనమిచ్చే సదాశివపేట పెద్ద చెరువు రియల్ ఎస్టేట్ భూ బకాసురుల కన్ను పడడంతో చెరివే మాయమైపోతుంది. ఫలితంగా ఆ చెరువు కింద ఉన్న వేలాది ఎకరాల సాగుకు నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ భూ కబ్జా సాక్షాత్తు టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, చేనేత చేనేత హస్తకాల అభివృద్ధి సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్ కను సైగతోనే కబ్జా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు ఒకవైపు తీసుకుంటే మరోవైపు వెంచర్ను ఏర్పాటు చేస్తూ చెరువులను సైతం వదలడం లేదు. ఇందుకు సంబంధించిన వివరాలు చూసినట్లయితే…
సదాశిపేట తాసిల్దార్ కార్యాలయానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎనికె పల్లి గ్రామానికి వెళ్లే రహదారికి పక్కన సదస్ పేట మున్సిపాలిటీకి సంబంధించిన డంపింగ్ యార్డ్ కు ఆనుకొని ఉన్న సదస్సు పేట ఎనకేపల్లి చెరువులను పూర్తిగా పూడ్చి వేశారు. ఇందుకుగాను సదస్సు పేట శివారులోని ఎన్కేపల్లి కి వెళ్లే దారిలో ఓ ప్రైవేట్ వెంచర్ యజమాని సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్ ఏర్పాటు చేస్తున్నాడు. వెంచర్ లో రోడ్ల నిర్మాణం కోసం తీసిన మట్టిని దానికి ఎదురుగానే ఉన్న చెరువులో వేసి పూడ్చి వేస్తున్నారు. దీనివల్ల చెరువులో నీరు ఉండకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు తూముల ద్వారా దిగివకు వృధాగా వదిలిపెడుతున్నట్లు రైతులు ఆరోపించారు. వెంచర్ లో రోడ్ల నిర్మాణం కోసం తీసిన మట్టిని ఏకంగా సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో గల చెరువును పూర్తిగా పూర్తి చేశారు. ఇది తాసిల్దార్ తో పాటు జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదు చేసిన ఎవరు స్పందించడం లేదని స్థానికులు ఆరోపించారు. ఒకవైపు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి విడతలో చెరువులు కుంటల మరమ్మతుల కోసం కోట్ల రూపాయల ఖర్చు చేసింది. ప్రస్తుతం ఆ చెరువులనే పూడ్చివేసి రియల్ ఎస్టేట్ దందాను కొనసాగిస్తుంది. కిందిస్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ఎవరి వాటాలు వారికి అప్పజెప్తూ చెరువులు పూర్తి చేస్తున్న అధికారులు చూస్తూ ఉండిపోతున్నారు కానీ చర్యలు తీసుకున్న పాపనా పోలేదు. సదాసిపేట్ కు జాతీయ రహదారి కి అతి సమీపంలో ఉన్న ఈ భూమికి 100 కోట్లకు పైగా వ్యాల్యూ ఉంది. ఇంత విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాతం అవుతున్నా ..అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఇందుకు వెంచర్లను ఏర్పాటు చేసేది అధికార పార్టీ నేతలు అయినందున తమకెందుకులే వచ్చిందే తడువుగా.. మామూలు తీసుకొని తమకు తెలియనట్టుగా ఉంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు ఎనికె పల్లి – సదాశిపేట మధ్యలో ఉన్న పెద్ద చెరువుతోపాటు పూడ్చివేసిన కుంటలో మట్టిని తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
రోడ్డు నుండి సైతం ఆక్రమించుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు…..
తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొనసాగించుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సదాశిపేట పట్టణం నుంచి ఎనకపల్లి వరకు వేసిన పంచాయతీరాజ్ రోడ్డు ను ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన యజమాని ఆక్రమించుకొని రోడ్డు వేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన వెంచర్లకు పంచాయతీరాజ్ రోడ్డు తో పాటు పక్కనే మరో రోడ్డు వేసి వెంచర్ కు డబుల్ రోడ్డు ఉందని కొనుగోలు దారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీరాజ్ రోడ్డుకు వెంచర్ యజమాని వేసిన కొత్త రోడ్డు మధ్యన డివైడర్ పెట్టి ఆకర్షణగా ఉండేలా ఏర్పాటు చేశారు. ఎవరైనా కొత్తవారు వస్తే డబ్బులు రోడ్డు ఉందని ఆకసితులై ఫ్లాట్లు కొనుగోలు చేస్తారన్న ఉద్దేశంతో ఏకంగా పంచాయతీరాజ్ రోడ్లోనే ఆక్రమించుకున్నాడు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.