కరీంనగర్ జిల్లా : బ్రిడ్జ్ సాధన సమితి జెఏసి చైర్మన్ సంపతీ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో సుడా చైర్మన్ జీవి రామక్రిష్ణ రావు కీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఎల్ఎండి నిర్మాణం తరువాత 50 సంవత్సరాల నుండి గన్నేరువరం మండలం మారుముల ప్రాంతంగా ఉండిపోయి విద్య ఉద్యోగునికి ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందికి గురి అవుతున్నారని అని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది, గన్నేరువరం మండల కేంద్రానికి బ్రిడ్జ్ వేయడం వలన బెజ్జంకి ఇల్లంతకుంట మండలాలకు కుడా దూర భారం తగ్గుతుంది అని చెప్పగా సానుకూలంగా స్పందించి నా వంతు సహాయ సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ పుల్లెల జగన్ మోహన్,ప్రధాన కార్యదర్శి పుల్లెల రాము,కోశాధికారి గుండ వెంకటేశం,ప్రచార కార్యదర్శి మునిగంటీ శ్రీనివాస్
సభ్యులు గర్షకుర్తి ప్రవీణ్, సమ్మెట రామకృష్ణ పాల్గొన్నారు.