కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో గురువారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఉత్సవాలలో భాగంగా శకటోత్సవం కార్యక్రమం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం చుట్టూ ఎడ్లబండ్లతో పాటుగా ట్రాక్టర్లు, కార్లు, ద్విచక్ర వాహనాలు కూడా గుడి చుట్టూ తిప్పారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఎస్సై మామిడాల సురేందర్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు, శాంతియుతంగా జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రామం నుండి కాకుండా పరిసరాల గ్రామాల నుండి పెద్ద ఎత్తున కార్లు ద్విచక్ర వాహనాలు వచ్చాయి, దేవాలయం చుట్టూ తిరిగిన అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి మొక్కులు సమర్పించుకొని కోరికలు తీర్చుకున్నారు, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు భక్తులు పాల్గొన్నారు.
