సాలూరు – పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పరిధి, పాచిపెంట మండలంలో జరగనున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, శ్రీ శ్రీ శ్రీ పారమ్మతల్లి అమ్మవారి కొండపై జరిగే జాతర ఏర్పాట్లను స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రివర్యులు గుమ్మిడి సంధ్యారాణి జిల్లా పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు అమ్మవారి ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు సూచనలు చేసారు.
మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, ప్రాంగణంలో పారిశుద్ధ్యం, తాగునీరు, శిబిరాలు, పోలీసు భద్రత వంటి అంశాలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. భక్తులకు మరింత సౌకర్యం కల్పించేందుకు మెరుగైన ఏర్పాట్లు చేపట్టేందుకు మంత్రివర్యులు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.
పారమ్మకొండ జాతర నిర్వహణకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేస్తూ, జాతర వైభవంగా జరగడానికి కృషి చేస్తున్నట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు.