- చిన్న బోతున్న బాహుదా తీర ప్రాంతం
- రసీదుల పేరుతో నిలువు దోపిడీ
- ఒక్క ట్రాక్టర్ కు 1200 వసూలు చేస్తున్న వైనం
అన్నమయ్య జిల్లా టీ : సుండుపల్లె మండలంలోని యర్రమనేనిపాలెం పంచాయతి పరిరిలోని కుప్పగుట్ట నుంచి రాయవరం పంచాయతిలోని చీనేవాండ్లపల్లె వరకు వున్న బాహుదా నదిలో ఇసుకాసురులు రాత్రింబవల్లు తేడా లేకుండా ఇష్టారాజ్యాంగ బాహుదానదిని తోడేస్తున్నారు. సాధారణంగా ఇసుక రీచ్ కు అనుమతిస్తే నదిలో ఇసుక తీసేవారు దారి ఏర్పాటు చేసి అనుమతులు పొందిన వారు అక్కడే ఉండి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రుసుము తీసుకుని అనుమతులివ్వాల్సి వుంటుంది. దీంతో పాటు ఎక్కడో ఒక చోట మాత్రమే అనుమతితో రీచ్ ఏర్పాటు చేయాల్సి వుంది. అయితే సుండుపల్లె మండల పరిధిలో అలాంటిదేవీ లేకుండా ఓ కంపెనీ పేరుతో కొందరు ప్రైవేటు వ్యక్తులు ఒక్కో ట్రాక్టర్ కు 1200రూపాయలు వసూలు చేసుకుంటున్నారు. రాయవరం చీనేవాండ్లపల్లె నుంచి సుండుపల్లె పీలేరు రహదారిలోని కాజ్వే వరకు ఎక్కడైనా ఇసుక తరలించు కోవచ్చని రసీదులు ఇస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆ రసీదులలో వివిధ గ్రామాల పేర్లతో స్టాక్ డీపో అని రాసిస్తుండడం గమనార్హం. ప్రతి రోజూ అక్రమంగా ఇసుక తరలింపు వలన నదీ పరివాహక ప్రాంతంలో వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు అడుగంటి పోయే అవకాశం ఉందని వ్యవసాయ పొలాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేసులు నమోదు చేయిస్తాం : తహసిల్దార్
ఇసుక తరలింపు విషయం తహశీల్దారు, దృష్టికి తీసుకెళ్లగాతమ శాఖ ద్వారా బాహుదా నదిలో ఇసుక తరలింపుకు ఎక్కడా అనుమతిలేదని అక్రమంగా ఇసుక తరలించే వారిని గుర్తించి కేసులు నమోదు చేయిస్తామని సుండుపల్లె మండల ఇంచార్జీ మహేశ్వర రెడ్డి తెలిపారు కొందరు రసీదు లిస్తున్నట్లు గుర్తించామని వాటిపై విచారిస్తున్నట్లు తెలిపారు