contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

“త్రవ్వేశారు”.. “తోడేశారు”.. “తోలేశారు” .. అయినా సప్తగిరుల్లా ఇసుక నిల్వలు !

తూర్పు గోదావరి జిల్లా, కడియం: ఇసుక నుండి తైలం పిండే ఘనులు ఉన్నారో లేరో తెలియదు కానీ, ఇసుక అక్రమ అమ్మకాల్లో కోట్లాది రూపాయలు దోసుకుపోయే ఘనులయితే ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జిటి ఫిర్యాదుతో దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొరడాజులుపించే వరకు తవ్వకాలు యదేచ్చగా జరిగాయి. గత ఫిబ్రవరి 20వ తేదీన జాతీయ హరిత ట్రిబ్యునల్ సభ్యుల బృందం స్థానిక కలెక్టర్ తో కలిసి మండలంలోని బుర్రిలంక – వేమగిరి ఇసుక ర్యాంపులో జరుగుతున్న తవ్వకాలను పరిశీలించారు. ఇక్కడ జరుగుతున్న తవ్వకాలపై ఎటువంటి సమాచారం వెల్లడించకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. వారు వెళ్ళిన మరుక్షణం మాకు అన్ని అనుమతులు ఉన్నాయంటూ పదుల సంఖ్యలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు మొదలుపెట్టారు. అయితే ఈ అక్రమ ఇసుక తవ్వకాలపై ఏ అధికారికి ఫిర్యాదు చేసిన తవ్వకాలుపై మాకు ఎటువంటి అధికారం లేదంటూ కొందరు , మా పరిధి కాదంటూ ఇంకొందరు, అసలు విషయం మాకు తెలీదoటూ ఇంకొందరు చెప్పుకొచ్చారు. ప్రతిరోజు రాత్రి పగలు తేడా లేకుండా కోట్లాది రూపాయల విలువ చేసే వందలాది లారీలతో ఇసుకను తరలించుకుపోయారు. దీనిపై శుక్రవారం బుర్రిలంక ఇసుక ర్యాంపును పరిశీలించగా ఇసుక ఎగుమతులకు ఉపయోగించే భారీ యంత్రాలు ఏటుగట్టులోపల ర్యాంపు నిర్వాహకుల కార్యాలయం వద్ద ఉండగా ఇసుక ఎగుమతితో ఉన్న ఓ భారీ లారీ ఇసుక ర్యాంపులో( నదీగర్భం లో )ఉంది. దీన్నిబట్టి పరిశీలిస్తే ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమార్కులు శుక్రవారం ఉదయం వరకు యదేచ్ఛగా ఇసుకను దోచుకుపోయినట్లుగా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. అలాగే ఇసుక అక్రమార్కులు ముందుచూపుతో ఏటుగట్టు సమీపాన ( పట్టా భూముల్లో) కోట్లాది రూపాయలు విలువ చేసే లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను నిలువ చేసి సప్తగిరులకు సవాల్ విసురు తున్నారు. ఈ అక్రమ త్రవ్వకాలు, నిల్వలు పై ఉన్నతధికారులు ఎలా స్పందిస్తారో? వేచి చూడాలి మరీ?..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :