మహబూబ్ నగర్ : నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ గ్రామంలో గత కొంతకాలంగా ఇసుక మాఫియా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తుందని సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ చేస్తున్న పోరాటం ఫలించింది. రాకొండ గ్రామంలో ఇసుక మాఫియా పట్టపగలు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న పట్టించుకోవడం లేదని సామాజిక కార్యకర్త ప్రవీణ్ చేస్తున్న పోరాటానికి మంగళవారం ఎట్టకేలకు ఫలితం దక్కింది. ఈ నేపథ్యంలోనే రాకొండ గ్రామంలో అక్రమ ఇసుక డంపులను మరికల్ తహసీల్దార్ జమీల్, ఆర్ఐ సుధాకర్ రెడ్డిలు మంగళవారం సిజ్ చేశారు. అనంతరం సిజ్ చేసిన 50 ట్రిప్పుల ఇసుకను మరికల్ ఏఎస్ఐకు అప్పగించారు.
ఇసుక అక్రమ రవాణా ను….అడ్డుకుంటాం
నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో రాకొండ గ్రామంలో ఇసుక మాఫియా మళ్లీ, మళ్ళీ రెచ్చిపోతున్న …. అడ్డుకోవాల్సిన పోలీస్, మైనింగ్, రెవిన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా, తాపీగా చోద్యం చూస్తున్నారని సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ విమర్శించారు. అంతేకాకుండా గతంలో ఇసుక మాఫియాకు కొందరు స్థానిక పోలీసులు, రెవిన్యూ అధికారులు కొమ్ముకాస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువేత్తయని అయన ఆరోపించారు. రాకొండ ఇసుక మాఫియాను అడ్డుకుంటామని, ఇసుక మాఫియాపై వాల్టా చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయిస్తామని సామాజిక కార్యకర్త, నేనుసైతం” స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిద్ది ప్రవీణ్ కుమార్ తెలిపారు.