contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఇసుక డంపులు సిజ్ .. ఫలించిన నేనుసైతం పోరాటం : దిడ్డి ప్రవీణ్ కుమార్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై గత 12 ఏళ్లుగా పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ మరోసారి ఇసుక మాఫియాని అరికట్టడంలో విజయం సాధించారు. గత నెల 26న నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ వాగు వద్ద డంపు చేసిన దాదాపు 20 లక్షల రూపాయల ఇసుకను సిజ్ చేయించిన సామాజిక కార్యకర్త … నిన్న అదే నారాయణపేట జిల్లా కోయిల్ కొండ మండలం లింగల్చేడ్ వాగు వద్ద అక్రమంగా డంపు చేసిన లక్షలాది రూపాయల ఇసుకను సిజ్ చేయించి ఇసుక మాఫియాకు చెక్ పెట్టారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి ….

గత పదిహేను రోజులుగా నారాయణపేట జిల్లా కోయిల్ కొండ మండలంలో ఇసుక మాఫియా మళ్ళీ ఇసుక అక్రమ రవాణాకు తెరలేపింది . ఈ అక్రమ రవాణాపై సమాచారం అందుకున్న సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ కోయిల్ కొండ మండలంలోని లింగల్చేడు, సూరారం, శేరివేంకటాపూర్ వాగు నుంచి కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై నిఘా పెట్టారు. పగలు ట్రాక్టర్లతో డంపులు చేయడం, రాత్రి 9:30 నుంచి దర్జాగా ఇసుక కొడుతున్నరన్న పక్క సమాచారాన్ని సేకరించిన ఆయన జిల్లా, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా స్థానికంగా కొందరు పోలీసులు, రెవిన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడంలేదని ఉన్నతాధికారులకు ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. కోయిల్ కొండ లోని దాదాపు నాలుగు అనధికారిక రీచుల నుండి ప్రతిరోజు రాత్రి సమయంలో 25 నుంచి 30 బెంజ్ లతో నారాయణపేట, పరిగి, మహబూబ్ నగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు ఇసుక మాఫియా దర్జాగా ఇసుకను అక్రమ రవాణ చేస్తుందని సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

లింగల్చేడ్ లో…. ఇసుక డంపులు సీజ్

కోయిల్ కొండ మండలంలో అక్రమ ఇసుక రవాణాపై సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు మైనింగ్ శాఖ, పోలీస్ శాఖ
రెవెన్యూ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో లింగల్చేడు వాగు వద్ద అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను సీజ్ చేశారు. మైనింగ్ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ సుజాత, కోయిల్ కొండ ఎస్ఐ భాస్కర్ రెడ్డి, కోయిల్ కొండ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు గౌరీ శంకర్, బురానుద్దీన్ తదితరులు ఇసుక డంపులను సీజ్ చేశారు. సిజ్ చేసిన ఇసుక విలువ దాదాపు లక్షల్లో ఉంటుందని వారు పేర్కొన్నారు.

ఇసుక మాఫియాపై కేసులు నమోదు చెయ్యాలి: ప్రవీణ్

నారాయణపేట జిల్లా కోయిల్ కొండ మండలంలో మళ్ళీ ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుందని , ఇసుక మాఫియాపై ఎస్పీ, కలెక్టర్ ఇద్దరు దృష్టి సారించి, ఇసుక మాఫియాను అరికట్టాలని ప్రవీణ్ కోరారు. అంతేకాకుండా ఇసుక మాఫియాకు మద్దతు తెలిపి అక్రమ రవాణా జరుగుతున్న, చోద్యం చూస్తున్న కొందరు రెవిన్యూ, పోలీస్, మైనింగ్, ఇరిగేషన్ శాఖ అధికారులపై జిల్లా కలెక్టర్, ఎస్పీలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనుమలు లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేసే వాహనాలను వెంటనే సీజ్ చేసి, కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరుపరచేలా జిల్లా కలెక్టర్, ఎస్పీలు కృషి చేయాలని ప్రవీణ్ కోరారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా భాజాప్త 25 నుంచి 30 భారత్ బెంజ్, టిప్పర్ లతో, జెసిబిలను పెట్టి, ప్రభుత్వ సంపదను కొల్లగొట్టి, లక్షలాది రూపాయలను ప్రజాదనాన్ని లూటీ చేస్తున్నా కోయిల్ కొండ ఇసుక మాఫియాపై వెంటనే కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :