contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హుకుంపేట లో ఇసుక మాఫియా .. పట్టించుకోని అధికారులు

  • విచ్చల విడిగా ఇసుక తోలకాలు!
  • చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు!!
  • లోకల్ నాయకుల అండతో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
  • ఇసుక మాఫియాతో ప్రముఖ పత్రిక విలేకరుల పాత్ర ఉన్నట్టు సమాచారం

అల్లూరి జిల్లా, హుకుంపేట,ది రిపోర్టర్ : మండలంలోని యదెచ్చగా ఇసుక అక్రమ రవాణాను పట్టించుకోని అధికారులు గుల్ల బారుతున్న గె డ్డలు,నది ప్రవాహాలు, మండలంలో గేడ్డలు గుళ్ళులుగా మారుతున్నాయి, కొందరు అక్రమ మార్కులు ఇసుకను ఇష్టా రాజ్యంగా తవ్వకాలు సాగించి లాభాలు గడిస్తున్నారు. మండలంలోని గెడ్దలను,ప్రవాహాలు పరిశీలిస్తే తీగలవలస పంచాయతీ, కమయ్యపేట, మగంబంద, పామురాయీ సమీపంలో ఇసుక క్వారీలు ఏక్కడ చూసినా అక్రమార్కులదే అవా కనిపిస్తుంది. ఈ మూడో క్వారీల నుంచి అధికంగా పాడేరు, హుకుంపేటలకు చెందిన అన్ని ప్రాంతాలకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. కూలీలతో ఇసుకను పోగు చేసి అదిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒకరోజు కూలీ డబ్బులు వ్యాన్లు లారీలు లోడ్ చేస్తే రూ.2వేల రూపాయలు, ట్రాక్టర్ లోడ్ చేస్తే రూ.1వెయ్యి వరకు సొమ్ము చెల్లిస్తున్నారు. బయటకు ఈ లోడ్ లను రూ.6500 నుంచి రూ.12 వేల వరకు అమ్మకాలు సాగిస్తు న్నట్లు యదార్ధ సమాచారం. ఇసుక పోగు చేసే కూలీల రేట్లు పెంపు లేదు కానీ చాలి చాలని డబ్బులతో రోజు వారి కూలీలకు పనులకు వస్తున్నట్లు కూలీలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై రెవిన్యూ అధికారులు పట్టించుకోక పోవడంతో ఈ వ్యవహారం ఇష్ట రాజ్యాంగ సాగుతుంది.వ్యాన్లు, ట్రాక్టర్లు, లారీలు ఏకంగా గేడ్డల వద్దకు వెళ్లి ఇసుకను లోడ్ చేసుకుని దర్జాగా తిరుగు తున్నాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.మారుమూల పట్టాం, బూర్జ,గత్తుం,జార్ర కొండ, మెరకచింత, గన్నేరు పుట్టు, అండిభ, దుర్గం బంధలు తదితర పంచాయతీల ప్రాంతాల్లో ఒక లోడుకు రూ.12వేల వరకు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దిగుడుపుట్టు, రాళ్లగడ్డ, పెద్దగరువు వంతెన వద్ద రోజుకు సుమారు 40 వాహనాలు నిలిచి లోడ్ కోసం కనిపిస్తాయి. రోజుకు 70కు పై చిలుకు లోడ్లు ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మండలంలోని తీగల వలస పంచాయతిలోనే కామయ్యపేట, మంగబంద, పామురాయి సమీప గేడ్డలలో అత్యధికంగా ఇసుకు డిమాండ్లు ఉన్నట్లు సమాచారం.మంచిగా దొరుకుతుండడంతో పాడేరు హుకుంపేట పరిసర ప్రాంతాల బళ్ళు అధికంగా వస్తున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు.వ్యాన్లు, ట్రాక్టర్లు, లారీలు సుమారు 80 వాహనాల వరకు నిలిచే కనిపిస్తాయి,రోజుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాన్ స్టాప్ గా 100కు పైచిలుకు లోడ్లు ఇసుక తరలిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక అక్రమా రావాణా తరలిస్తున్నారు. చుట్టుపక్క గ్రామస్తులు భయంతో బిక్కు, బిక్కుమంటున్నాం.లోడ్ వేసుకొని వేగంగా వాహనాలు నడుపు తుండడంతో ఊరు పక్కనున్న పిల్లలు ఇటు అటు తిరిగేందుకు కూడా భయ పడుతున్నారు.  ప్రమాదపుటంచును కొండల నుంచి నీరు గడ్డలో నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో ఇసుక కోసం తవ్విన గుంతలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి దీంతో గిరిజనులు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోపక్క వంతెన వద్ద ఇష్టానుసారంగా ఇసుకను తవ్వడం వల్ల బ్రిడ్జిలు దెబ్బతింటున్నాయి. అది కూలిపోయే ప్రమాదాలు ఉంటుందని పలువురు అందులోనే వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే బీటలు వారిన ఘటనలు ఉదాహరిస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శి, విఆర్వో లకు వివరాలు కోరగా పంచాయతీలో ఎటువంటి రుసుములు చెల్లించకుండానే ఇసుకను తరలిస్తున్నారని,తమకు ఎటువంటి సమాచారం లేదని వారు తెలిపారు. పంచాయతీ పరిధిలో పన్నులి చెల్లించాల్సి టోకెన్లు తేసుకో వలసిఉంటుందని వారు అన్నారు. అక్రమ రవాణా అడ్డుకట్టు వేయాలని రాత్రి పగలు ఇష్టరాజంగ ఇసుకను తరలిస్తుండడంతో గెడ్డలు లోతుకి వెళ్ళిపోతుందని గ్రామ ప్రజలు కోరుతున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని వాళ్ళు భయపడుతున్నారు. రోజురోజుకి ఇసుకను తీయడం వల్ల వంతెనలకు,రహదారులకు ప్రమాదాలు పెంచుతుందని వారు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :