contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మంజీరా లో జోరుగా ఇసుక దోపిడీ…

మంజీరా లో జోరుగా ఇసుక దోపిడీ తూ తూ మంత్రంగా పట్టుకుంటున్నారు వదిలేస్తున్నారు.  కామారెడ్డి జిల్లా బాన్స్వా డ డివిజన్ పరిధిలోని మంజీరా నది పరివాహక ప్రాంతం ఇసుక అక్రమ రవాణా కు కేరాఫ్ అడ్డాగా మారింది చుట్టూ పక్కల మండల ల ప్రజలకు ఇది ఒక జీవనోపాధి గా మారింది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రైతులకు అందచేసిన యంత్ర లక్ష్మి ట్రాక్టర్ల లకు వ్యవసాయ పనుల కంటే ఇసుక అక్రమ రవాణా నే అధిక ఆదాయాన్ని ఇవ్వడం తో చాలా మంది ఇటు వైపు మొగ్గు చూపుతున్నారు కొందరు అయితే తమ తమ బంధువుల ట్రాక్టర్ల ను తమ గ్రామాలకు తీసుకొని వచ్చి తాము వారి నుండి ట్రాక్టర్ విక్రయించి నట్లు చెబుతూ ఇక్కడ ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు చాలా గ్రామాలలో వి డి సి కమిటీ ఇసుక రవాణా లో కీలక పాత్ర పోిస్తుంది స్థానిక ప్రజా ప్రతినిధులు పోలీసులకు,రెవెన్యూ అధికారులు మధ్య సమన్వయo చేస్తూ అక్రమ ఇసుక రవాణా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తమ వంతు సహాయ సహకారాలు అదంచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తన్నాయి అప్పుడప్పుడు పోలీసులు ఇసుక ట్రాక్టర్ లను పట్టు కున్న చిన్న చిన్న ఫైన్ లు వేసి వదిలేయడంతో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తులకు పోలీసుల పట్ల భయం లేకుండా పోతుంది దీనికి తోడు పోలీసుల పై రాజకీయ నాయకుల ఒత్తిడి కూడా ఒక కారణంగా చెప్ప వచ్చు దీంతో పోలీసులు కటిన చర్యలు తీసుకో లేక పోతున్నారు మరో వైపు మంజీర నది నుండి జేసిబి లతో లారిలలో సైతం ప్రభుత్వ పనులు పేరిట కోట్ల రూపాయల విలువ చేసే ఇసుక అక్రమంగా రవాణా జరుతుందని వాటిని పట్టించుకోని అధికారులు పిచ్చుక పై బ్రహ్మాస్త్రం అన్నట్లు ట్రాక్టర్లను పట్టుకొని తమ తమ ప్రతాపం చూపిస్తున్నారని మరి కొందరు ట్రాక్టర్ డ్రైవర్లు యజమానులు అంటున్నారు ఏది ఏమైనప్పటికీ భవిషత్ భావితరాల కోసం ఇక్కడి ఇసుక సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి బాధ్యత అని పలువురు అంటున్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :