మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని పరిధిలో గల అక్కింపేట గ్రామం హల్దీ వాగు నుండి ఇసుక అక్రమ తరలింపులు జోరుగా సాగుతున్నాయి. రోజుకు వందల ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటల నుండి ప్రతిరోజు మూడు గంటల వరకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. అధికారులు మాత్రం అక్రమార్కులను చూసి చూడనట్లు వదిలేస్తున్నారు.నాయకు లకు భయపడి అధికారులు అక్రమ ఇసుకాసుర లను అడ్డుకోలేక పోతున్నారు. దీంతో ఇసుక బకాసురులు హల్దీ వాగుని తోడేస్తున్నారు. నిత్యం లక్షల్లో ఇసుక అక్రమ వ్యాపారం చేస్తున్నారనే ప్రరచారం సాగుతోంది.
అంతేకాక మండలంలో మట్టి తవ్వకాలు యధేచ్చగా సాగుతున్నాయి. మట్టి ఏదైనా చిటికెలో ఎన్ని ట్రాక్టర్ల లోడు కావాలన్నా ఇస్తారు. రాత్రి, పగలు.. ఎక్కడ.. ఎంత తవ్వినా అడిగే వారే లేరు. అక్రమార్కులకు అడ్డే లేదు. వాల్టా చట్టం ప్రకారం చెరువు, పొ లాల్లో మట్టి తవ్వకాలకు సంబంధిత రెవెన్యూ, గనుల శాఖల అనుమతి పొందాల్సి ఉంది. ఇక్కడ ఎలాంటి అనుమతులు తీసుకోరు. అధికారులు కూడా చూసీచూడనట్టు వదిలేస్తారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.