contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపేవరకు ఉధ్యమిస్తాం : ప్రవీణ్ కుమార్

  • మాఫీయా నీడలో…. మాగనూరు
  •  మాఫియా చెప్పిందే చట్టం…చేసిందే న్యాయం
  •  మామూళ్ళ మత్తులో పోలీసు…రెవెన్యూ అధికారులు
  •  మొద్దునిద్రలో…. మైనింగ్ శాఖ
  •  కోట్లకు పడగలేత్తిన…. ఇసుక మాఫియా
  •  వందలాది లారీల ఇసుక…. అక్రమ డంపు.
  •  ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపేవరకు…. ఉధ్యమిస్తాం
  •  సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్

నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వర్కుర్, నేరేడుగావ్ గ్రామ శివారులో గల పెద్దవాగు నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే పట్టించుకునే నాథుడే కరువయ్యారని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్చంద సంస్ద అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం నేనుసైతం స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోట్లాది రూపాయల విలువల చేసే ఖనిజ సంపద ఇసుకను అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా… వందలాది లారీలతో డంపు చేసినా…. అటువైపు రెవెన్యూ…. పోలీస్…,మైనింగ్…ఇతర శాఖల అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడం విడ్డురంగా ఉందన్నారు. ఇక్కడ ఇసుక మాఫియా చెప్పిందే చట్టం……..చేసిందే న్యాయం అన్న చందంగా….మాఫియా నీడలో …..మామూళ్ళ మత్తులో కొందరు పోలీస్, రెవెన్యూ అధికారులు తూగుతుంటే…..మొద్దు నిద్రలో మైనింగ్ శాఖ ఉండడంతో… కోట్లాది రూపాయల ప్రజాధనం ఊటీ అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాజప్తా….ఏ ఒక్క అధికారికి భయపడకుండా గ్రామ శివారులో గుట్టలను తలపించేలా ఇసుకను అక్రమంగా డంపు చేసినా…. కనీసం పోలీసు, రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు ఆ అక్రమ ఇసుకను సీజ్ చేసేందుకు జంకుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. మొన్నటికి మొన్న గత నెల 28న ఇదే మాగనూరు మండలం వర్కుర్ నుండి అక్రమంగా కర్నాటకు కె.ఎ 33ఎ 4344 భారత్ బేంజ్ నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేస్తే…. `అబ్బే …..అక్రమంగా తరలించడం లేదని…… ఆ వాహనానికి అనుమతులున్నాయని’ కాకమ్మ కథలు చెప్పినా మాగనూరు ఎస్ఐ నరేందర్ అనుమతి పత్రాలను పంపిస్తానని చెప్పి…. ఆ తర్వాత ఫోన్ ఎత్తలేదన్న విషయాన్ని ఈ సందర్బంగా ప్రవీణ్ గుర్తు చేశారు. అనుమతులున్నాయని చెప్పినా ఎస్ఐ ఆ తర్వాత ఆ వాహనంపై కేసు ఎలా నమోదు చేశారని, ఆ వాహనానికి 25వేల రూపాయలు మాగనూరు తహిసిల్దార్ ఫైన్ వేసిన మాట వాస్తవం కదా…. అని ఈ సందర్బంగా ప్రవీణ్ ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన ఎస్ఐ పదవీలో ఉండి తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం కాకుండా…. అక్రమంగా ఇసుకను తరలించే వాహనానికి వత్తాసు పలికిన మాగనూరు ఎస్ఐ నరేందర్ ను ఎందుకు సస్పెండ్ చేయరని ఆయన ప్రశ్నించారు. ఈ సంఘటన జరిగి 5 రోజులు గడవకముందే దాదాపు వంద భారత్ బేంజ్ ల ఇసుకను అక్రమంగా డంపు చేసి అదే ప్రాంతం నుండి అక్రమంగా రాష్ర్ట సరిహద్దులు దాటి కర్నాటకు తరలించేందుకు ప్రయత్నిస్తున్న స్ధానిక రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం చూస్తే వారి చిత్తశుద్ది ఏ మాత్రం ఉందో స్పష్టమవుతుందన్నారు. అంతేకాకుండా ఇసుక మాఫియా ఇచ్చే ఆమ్యాయాలకు అలవాటు పడ్డ కొందరు అధికారులు ఇసుక మాఫియాకు బహిరంగంగా మద్దతిస్తూ మాఫియాను అడ్డుకోకపోగా, ప్రత్యక్షంగా ఇసుకను అక్రమంగా తరలించేందుకు సహకరిస్తున్నారన్న ఆరోపణలకు పెద్దఎత్తున వినిపిస్తున్నాయన్నారు. ఇకనైనా వెంటనే మాగనూరు మండలంలోని వర్పూరు, నేరుడుగావ్ గ్రామ శివారులో అక్రమంగా ఏర్పాటు చేసిన దాదాపు వంద ట్రిప్పుల ఇసుకను వెంటనే రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖ అధికారులు సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటి చేస్తూ పక్క రాష్ర్టాలకు తరలిస్తున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా మాగనూరు ఎస్ఐ నరేందర్ తో పాటు సంబంధిత రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో నేను సైతం స్వచ్చంద సంస్ధ ఆధ్వర్యంలో ఉధ్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

 ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపేవరకు…. ఉధ్యమిస్తాం : ప్రవీణ్ కుమార్

నారాయణపేట జిల్లాలో ఇసుక మాఫియాను అరికట్టేందుకు గతంలో జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కృషి చేశారని, ప్రస్తుతం మాగనూరు మండలంలో యథేచ్చగా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న ఇసుక మాఫియాపై కూడా ఎస్పీ వెంకటేశ్వర్లు దృష్టి సారించి ఇసుకను మాఫియాను కట్టడి చేయాలని ప్రవీణ్ కోరారు. అంతేకాకుండా ఇసుక మాఫియాకు వత్తాసు పలికి అనుమతి లేని వాహనాలతో, అక్రమ ఇసుక రవాణా చేసే వాహనాలకు అనుమతులు ఉన్నాయంటూ అబద్దపు సమాచారం ఇస్తూ మాఫియా ఇచ్చే మామూళ్ళకు తలొగ్గి మాఫియాకు దాసోహమైన మాగనూరు ఎస్ఐ నరేందర్ పై వెంటనే సస్పెన్షన్ వేటు వేసి శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లను ఈ సందర్బంగా ప్రవీణ్ కోరారు. నారాయణపేట జిల్లాలో ఇసుక మాఫియాను అరికట్టకపోతే ఇనైనా నారాయణపేట జిల్లాలో ఇసుక మాఫియాను అధికారులు కట్టడి చేయకపోతే మరో సారి రాష్ర్ట అత్యున్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించి ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపే వరకు ఉద్యమం కొనసాగిస్తామని సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. విలేకరుల సమావేశంలో బాలరాజు, విష్ణు, సమీర్, నవీన్, సలాం, పాష తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :