శ్రీ సత్యసాయి : పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ కు ఘోర పరాభవం జరిగింది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వస్తున్న శంకర్ నారాయణను ఈదుల బలాపురం గ్రామస్తులు అడ్డుకున్నారు. రేణుక నగర్ సమీపంలో రోడ్డుకు అడ్డంగా నిలబడి శంకరనారాయణ ప్రయాణిస్తున్న వాహనంపై చెప్పులతో దాడి చేశారు. గ్రామస్తుల నిరసన నేపథ్యంలో వాహనాన్ని వెనక్కి తిప్పుకుని శంకరనారాయణ వెళ్లిపోయారు. పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణపై దాడి చేయించింది మరెవరో కాదు. సొంత పార్టీ నేత నాగభూషణ రెడ్డి అనే ఆరోపణలు వినవస్తున్నాయి . ఈదులబలాపురం గ్రామంలో అభివృద్ధిని ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారన్నారు. ఐదు నెలలు గ్రామంలో రేషన్ సరుకులు వేయలేదని . గ్రామస్తులను అవమానిస్తున్నాడని… వైసీపీ మీద అభిమానంతో వదిలి పెట్టమని, లేకుంటే ఎమ్మెల్యే శంకరనారాయణను బట్టలూడదీసి కొట్టేవాళ్ళమంటూ నాగభూషణ్ రెడ్డి అన్నట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
