సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పొట్ట కూటి కోసం పని చేసుకుంటున్న వ్యక్తులు ఎంతోమంది పేదవాళ్లు ఇల్లు కట్టుకొని జీవిస్తున్నారు. 59 జిఓ కి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దరఖాస్తు పెట్టుకున్న పాపానికి అధికారులు పేద కుటుంబాల పైన అధికారం చెలాయిస్తున్నారు అధికారులు రెండు రోజుల్లో మీరు 59 జిఓ అప్లికేషన్ పెట్టుకున్న దానికి ఆరు లక్షలు వేసి రెండు రోజుల్లో కట్టకపోతే మీ ఇల్లు కూల్చి వేస్తాం అని చెప్పి అధికారులు బెదిరించడం జరిగింది. దాంతో వినాయక నగర్ కాలనీలో జీవిస్తున్న మనీలా అనే ఆమె అధికారులు నోటీస్ ఇచ్చి ఇళ్ళు కూల్చేస్తామని బెదిరీయడంతో ఆ తల్లి మనీలా ఇరుగుపొరుగు వారి దగ్గర లేదా ఎవరి దగ్గర డబ్బులు వడ్డీకి తీసుకురావాలో అర్థం కావట్లేదు, చావాలో బతకాలో అని ఏడుస్తూ బాధపడుతుంది.అది తెలుసుకున్న బిజెపి నాయకుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి . అమ్మ నువ్వు బాధపడకు నీకు అండగా మేముంటాం ఏ అధికారులు వచ్చి ఇల్లు కూల్చకుండా చూస్తామని ఆనంద్ కృష్ణారెడ్డి ఆతల్లికి హామీ ఇవ్వడం జరిగింది.ఆనంద్ కృష్ణారెడ్డి అధికారులకు రెండు చేతులు జోడించి పేదవాళ్ళ మీద దౌర్జన్యం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రజల మీద దాడి చేస్తే మా ప్రాణాలైనా లెక్క చేయకుండా వాళ్ళ కోసం పోరాడుతామని ఎమ్మార్వో ఆఫీస్ ని ముట్టడిస్తామని హెచ్చరించడం జరిగింది ఎవరైనా పేదవాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే సహించమని బీజేపీ నాయకుడు ఆనంద్ కృష్ణారెడ్డి హెచ్చరించడం జరిగింది