సంగారెడ్డి : అప్పటి వరకు పిల్లలకు పాఠాలు బోధిస్తూ మంచిగానే ఉన్నది.. ఒక్క సారిగా చాతిలో నొప్పి వస్తుంది అంటూ తరగతి గదిలో టీచర్ పడిపోవడం తో వేనంటనే విద్యార్థులు తోటి ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వడం తో వెంటనే ఆమెను సంగారెడ్డి లోని ఆసుపత్రి కి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. సంఘటన సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. సంగారెడ్డి పట్టణానికి చెందిన పద్మలత అనే ఉపాధ్యాయురాలు గత ఐదు సంవత్సరాలుగా చౌట కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తుంది. ఎప్పటి లాగే బుధవారం ఉదయం అర్థం వచ్చిన ఉపాధ్యాయురాలు గుండెపోటుతో తరగతి గదిలో కుప్పకూలడంతో ఆస్పత్రికి తరలించిన ఫలితం దక్కలేదు. ఉపాధ్యాయులు పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సంతాపం వ్యక్తం చేశారు
