సంగారెడ్డి జిల్లా , పటాన్ చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ కాటా శ్రీనివాస్ గౌడ్ గారి ఆదేశం మేరకు, శ్రీ రాహుల్ గాంధీ గారి వరంగల్ డిక్లరేషన్ ప్రకారం రైతుల రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్ర పటానికి అమీనుపూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శివాలయం చౌరస్తాలో ఈ రోజు ఉదయం 11-30 గంటలకు అమీనుపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి. శశిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఆగష్టు 15 తేదీ లోగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేయడం జరుగుతుంది. ఏడుపాయల వనదుర్గ మాత సాక్షిగా అన్న మాట నెరవేర్చిన ముఖ్యమంత్రికి రైతులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అమీనుపూర్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి గారు విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీని నెరవేర్చి మాట నిలబెట్టుకున్నది. ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతగా వారి చిత్ర పటానికి ఈ రోజు క్షీరాబిషేకం చేశాము. రుణ మాఫీ చేయటానికి తమ వంతు సహకారం అందించిన మన మంత్రివర్యులు శ్రీ దామోదర రాజ నరసింహ గారికి ధన్యవాదములు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ కొల్లూరి మల్లేష్, యూసుఫ్, సద్దుల మల్లేష్, ఉపాధ్యక్షుడు మన్నె రవీందర్, బీరంగూడ శివాలయం ఛైర్మన్ సుధాకర్, రమేష్ యాదవ్, కుమ్మరి మహేష్, సతీష్, భిక్షపతి, భవానీపూర్ శంకర్, మహిపాల్ రెడ్డి, శరత్, పెద్ద మల్లేష్, గోపాల్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, కృష్ణా యాదవ్, బిల్లి శ్రీనివాస్, ఇక్రిశాట్ మల్లేష్, ఇక్రిశాట్ మహేష్, ఎల్లయ్య, మల్లేష్, దీపక్, ప్రవీణ్, సిద్దు, శరత్, ఈశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నాగేష్ మరియు కె.ఎస్.జి. సభ్యులు తదితరులు పాల్గొన్నారు.