సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. డీఎస్పీ రవీందర్ రెడ్డి మీడియాతో పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో మాట్లాడారు. ఐడీఏ బొల్లారానికి చెందిన యూపీవీఎస్ విండో ఫిట్టర్ రవి, పెయింటర్ సోమశేఖర్ లు అమీన్ పూర్ లింగమయ్య కాలనీకి చెందిన విన్నకతోట లిఖిత్ పవన్ కుటుంబ సభ్యులతో కలిసి గత నెల 28న అరుణాచలం వెళ్లి తిరిగి వచ్చే సరికి ఇంట్లో దొంగతనం జరిగింది. బీరువాలోని బంగారం, వెండి దొంగలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అమీన్ పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టి రవి , సోమశేఖర్ లను అరెస్ట్ చేశారు. బొల్లారం, అమీన్ పూర్, దుండిగల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏడు దొంగతనాలకు పాల్పడినట్లు డీఎస్పీ వెల్లడించారు. వీరి వద్ద నుంచి పది తులాల బంగారం, విదేశీ కరెన్సీ, బైక్ రికవరీ చేసినట్లు తెలిపారు.