- సెంటర్ కు ఇవ్వవలసిన సామాగ్రి ఇండ్లలోకి..
- అధికారులు కాంట్రాక్టర్ కుమ్మక్కై..
సంగారెడ్డి : కేంద్ర ప్రభుత్వం నిరుపేద గర్భిణి, బాలింతలతో పాటు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలన్న ఉద్దేశంతో కోట్ల రూపాయల వ్యయంతో జాతీయ ఆరోగ్య శాఖ నిర్ధారించిన పోషక విలువలతో కూడిన సామాగ్రిని మాత్రమే సరఫరా చేసేందుకు టెండర్లు వేస్తారు. అదే సమయంలో స్పష్టంగా కాంట్రాక్టు పొందిన వ్యక్తి అంగన్వాడి కేంద్రాలలోనే వాటిని అప్పగించి ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేసి జిల్లా అధికారులతో పాటు ప్రాజెక్టు అధికారికి ఫోన్ వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా గుడ్లు, పాలు అంగట్లో సరుకుల మారిపోయాయి. ఇంకేముంది దర్జాగా కిరాణా షాపులలోకి తరలిస్తున్నారు. వీటిని పర్యవేక్షించవలసిన అధికారులు కాంట్రాక్టర్ తో పాటు అంగన్వాడి టీచర్ల నుంచి నెలవారి మామూలు దండుకొని చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనమే శుక్రవారం సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రమైన పుల్కల్లో ఓ అంగన్వాడి కేంద్రానికి సరపర చేయవలసిన పాల ప్యాకెట్లను పట్టపగలే దర్జాగా అంగన్వాడీ టీచర్ ఇంట్లో నిలువ చేసి ఉంచారు. నిబంధనల ప్రకారం ఏ సెంటర్ కి ఎంత కేటాయించారో అక్కడే వాటిని అంగన్వాడి సిబ్బందికి అప్పగించాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్ కిందిస్థాయి కార్మికులతో ( పనిచేసే వారితో ) సామాగ్రి తరలించడం వల్ల వారికి అవగాహన లేని కారణంగా టీచర్లు ఎక్కడ పెట్టమంటే అక్కడే కాలీ చేస్తున్నారు. దీని ఫలితంగా నిరుపేద గర్భిణి మహిళల తో పాటు బాలింతలు, పిల్లలకు అందవలసిన పౌష్టికాహారం అందడం లేదని చెప్పవచ్చు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1504 అంగన్వాడి కేంద్రాల్లో 85853 మంది పిల్లలు ఉన్నట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పిల్లలతో పాటు మరో 60,000 మంది బాలింతలు, గర్భిణీలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. కానీ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా నిరుపేదలకు అందవలసిన పాలు, గుడ్లు అంగట్లో మార్కెట్ల మారి కిరణ్ షాపుల్లో దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల అయితే టీచర్ మార్కెటింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని ఎందుకు నిదర్శనమే పుల్కాల్లో ఓ అంగన్వాడి టీచర్ ఇంట్లో పాలు నిల్వ చేయడమే నిదర్శనం.
ఫోటో : పుల్కల్ ప్రధాన రహదారీ పక్కనే ఉన్న ఓ అంగన్వాడి టీచర్ ఇంట్లోకి పాల కాటన్ తీసుకెళ్తున్న కార్మికుడు సర్కిల్లో
2: అంగన్వాడి టీచర్ ఇంటి ఎదుట పాల కాటన్ లను ఖాళీ చేస్తున్న ఆటో