సంగారెడ్డి: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట, రామంతపూర్ లలో ఒకటవ తరగతి ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశం కొరకు అర్హత గల పేద గిరిజన విద్యార్థిని విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
2023-24 విద్యా సంవత్సరమునకు గాను ఒకటవ తరగతి ఇంగ్లీష్ మీడియoలో ప్రవేశానికి అభ్యర్థి వయస్సు 01-01-2017 నుండి 31-12-2017 మద్య జన్మించి ఉండాలని, తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం 1,50,000 నుండి రెండు లక్షలకు మించరాదని తెలిపారు.
తెల్ల కాగితంపై పూర్తి వివరాలు నింపి, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో తహసిల్దార్ నుండి ధ్రువీకరించిన కుల, ఆదాయ, నివాస జనన ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులను ధరఖాస్తుకు జతపర్చి ఈనెల 29 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ధరఖాస్తు ఫారాలు జిల్లా గిరిజన అభివృద్ది అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.
మే 3న సమీకృత జిల్లా కలెక్టరేట్ లో గల జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో డ్రా నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేయనునట్లు తెలిపారు.
జిల్లాలో అర్హులైన గిరిజన విద్యార్థినీ విద్యార్థులు తమ సర్టిఫికెట్లతో ఈనెల 29 లోపు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ సూచించారు.