సంగారెడ్డి సదాశివపేట పట్టణంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి ఆబారణల ఊరేగింపు కొనసాగింది..మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అయ్యప్ప స్వామి వారి ఆభరణాలను స్థానిక సంగమేశ్వర మందిరంలో మొదటి పూజ గావించి అక్కడి నుంచి పురవీధుల గుండా ప్రయాణిస్తూ దుర్గమ్మ గుడి వద్దకు అటు నుంచి చిన్న బసవేశ్వర మందిరం వరకు స్థానిక గాంధీ చౌక్ నుంచి అయ్యప్ప స్వామి మందిరం వరకు ఆభరణాలను ఊరేగింపుగా చేస్తూ నృత్యాలు చేసారు . పట్టణమంతా ఆధ్యాత్మిక రంగు కులుముకుంది ఎక్కడ చూసినా అయ్యప్ప స్వాముల నృత్యం సందడిగా మారింది.. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాజరయ్యి ప్రత్యేక పూజలు చేశారు
