- పంచాయితీ యంత్రంగం పారిశుధ్యంకు వ్యతిరేకమని విమర్శిస్తున్న గిరిజనులు
- డ్రైనేజీ కాలువలు పై పలకలు వేయడంతో పేరుకుపోతున్న చెత్త,చెదారం
- క్రీమీకీటకాలు బారిన పడి విషజ్వారాలకు గురైతున్న గిరిజనులు
అల్లూరి జిల్లా (ది రిపోర్టర్ ): హుకుంపేట పంచాయితీ పరిధిలో గల అమ్మవారి ఆలయం నుండి ప్రభుత్వ పాఠశాల వరకు వున్న కాలువలో చెత్త చెదారం అధికం కావడం వలన గిరిజనులు పలు సమస్యలు ఇబ్బందులకు గురి అవుతున్నారు.
ఈ సమస్యపై పలువురు గిరిజనులు మాట్లాడుతూ… పంచాయితీ లోపం ప్రక్కన పెడితే ఈ కాలువలు ప్రక్కన ఉన్న షాపులు, భవనాలు వున్నవారు వారి సౌకర్యం నిమిత్తం సిమెంట్ పలకలు మరి కొందరు ఏకంగా కాలువలు మీద ప్లాస్టింగ్ కూడా చేయించేస్తున్నారు.దీని వలన రోజురోజుకూ చెత్త, చెదారం, మురికి నీరునిల్వ వుండటం వలన దీని నుండి వచ్చే దుర్వాసన వెదజల్లడం ముఖ్యంగా మురికి నీరు వలన క్రీమీకీటకాలు అధిక సంఖ్యలో పెరగడం వీటిని బారిన పడి రకరకాల వ్యాధులు విష జ్వారాలు బారిన పడి గిరిజనులు పలు సమస్యలు ఇబ్బందులు ఎదుర్కుం టున్నారు.మన్యంలో జీవనం సాగించే గిరిజనులకు గుండె నొప్పి షుగర్ వంటి బారిన పడి మృతి చెందేవారు 100 కు 10 శాతం మాత్రమే వుంటుంది. కానీ విష జ్వారాలు బారిన పడి ప్రతి సంవత్సరం మన్యంలో గిరిజనులు లెక్క లేనన్ని మంది మృతి చెందుతున్నారు.ఇది కేవలం క్రీమీకీటకాలు వలనే జరుగుతున్నాయి.దీనికి కారణం పంచాయితీ మరియు అధికార యంత్రాంగం వారు పారిశుద్ధ్యం పై దృష్టి సారించకపోవడం ఈ సమస్య పరిష్కారం చేయకపోవడం వలనే జరుగుతున్నాయి అనే ఆరోపణలు వెల్లు వెత్తు తున్నాయి.ఆరోపణలు కాదు వాస్తవమనే చెప్పాలి.దీనికి నిదర్శనం పైన వున్న ఫోటోలు వీడియోలు చూస్తే కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది.కాలువలు మొత్తం చెత్త చెదారం మురికి నీరు వుండటం దీని వలన గిరిజనులు పలు సమస్యలు ఇబ్బందులు వారిని పడటం వాస్తవమే దుర్వాసన రావడం వాస్తవమే క్రీమీకీటకాలు అధకం కావడం వాస్తవమే విశ జ్వరాలా బారిన పడి ప్రాణాలు మీదికి రావడం వాస్తవమే ఈ సమస్య వలన గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారనేది నేరుగా కనిపిస్తుంది కనుక జిల్లా వున్నతాధికారులైన ఈ సమస్యపై దృష్టి సారించి పరిష్కారం చేయాలని కోరారు.ఏది ఏమైనప్పటికీ వున్నతాధికారులు ఈ సమస్య ఎవరీ నిర్లక్ష్యం వలన ఏర్పడింది అనేది ఎవరూ గుర్తిస్తారు, ఎవరిపై చర్యలు తీసుకుంటారు ఈ సమస్య పరిష్కారం చేస్తారా లేకా గిరిజనులే కదా వాళ్ళ ప్రాణాలు పోతే మనకెందుకులే అని జాప్యం చేస్తు నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తూ సమస్య గాలికి వదిలేస్తారా అనేది అందరూ వేచి చూడాల్సిందే.