రాష్ట్రంలో భారీ వర్షాలు కారణంగా వరదల్లో చిక్కుపోయిన విజయవాడ ప్రజలకు చేయూతగా సంతనూతలపాడు సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నాలుగువేల వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్ , 1000 కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు ప్యాకెట్లు వంటి వస్తువులను పంపేందుకు ఏర్పాటు చేసిన వాహనాన్ని గురువారం సంతనూతలపాడు తాసిల్దార్ వేమూరు ఆదిలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. దాత వేమా ప్రభాకర్ ను తాసిల్దార్ అభినందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పి నారాయణ చౌదరి సిహెచ్ రాము గోపాల్, కొప్పోలు శ్రీనివాసరావు, కె .రమేష్ ,వి. నాగరాజు సిహెచ్ చంద్రావతి, వేమా కవిత ఎస్ ధనలక్ష్మి ,ఎస్. కే హసీనా బేగం ,కంకణంపాటి వెంకటేశ్వర్లు, నల్లమోతు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.