సర్పంచ్ లను అరెస్ట్ చేసిన పోలీసులు
ఏపీలో సర్పంచ్‌ల ముట్టడి కార్యక్రమం రసాభాసగా మారింది.
ఏపీ సర్పంచ్‌ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ లోని పంచాయతీరాజ్ కమిషనరేట్ ముట్టడి పిలుపునివ్వగా.
ఒక్కసారిగా సర్పంచ్‌లు వందలాది మంది పంచాయతీరాజ్ కమిషనరేట్ వైపు దూసుకొచ్చారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్టు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
పోలీసులు. సర్పంచులను ఎత్తి వెహికల్స్‌లోకి ఎక్కించారు. 15 ఆర్థిక సంఘం నిధులు వచ్చి 40 రోజులు అవుతున్నా నేటికీ విడుదల కాకపోవడంపై సర్పంచులు ఆందోళనకు దిగారు.
తాము కూడా ముఖ్యమంత్రి జగన్‌లాగా ప్రజలు ఎన్నుకుంటేనే గెలిచామని. మీరంతా పార్టీ గుర్తుపై గెలిస్తే మేం మాత్రమే ప్రజల ఆమోదంతో గెలిచామని చెప్పుకొచ్చారు